అరె చూడు చూడు నీళ్ళు... బలే ఎర్ర రంగులో వున్నాయే చూడు ఇలా(..
చెప్పుకుంటూ ఆడుకుంటున్న చిన్న పిల్లలు..
తీరా చూస్తే రక్తం, రోడ్డు నిండా జలపాతంలా కారుతుంది.
ఏంటి ఈ రక్తం? ఎక్కడనుంచా? అని చుస్తూ రోడ్డు మీద వస్తూ పోయే వాళ్ళని విచారిస్తూ వుండగా రోడ్డుకి అడ్డంగా పెళ్లి బోజనాలకి వచ్చినట్టుగా గుంపులు గుంపులుగా నుంచుని వున్న జనాలను చూసి బహుశా ఏదో పెళ్ళో / నాటకమో జరుగుతుందేమో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న నా పాములాంటి చెవులకి "ఒక పెద్ద బస్సు ప్రమాదం జరిగిందట. బస్సు వెళ్లి ఒక పెద్ద లారి ట్రక్ కు గుద్డుకుందంట. అని మాటలు వినిపించాయి."
ఆరా తీసి వెళ్లి చుస్తే... గుంపులు గుంపులు నుంచుని అందరూ వింతగా చూస్తున్న ఆ నాటకం ఇదే! కానీ నేను వెళ్ళే సరికే సగం ఘోరం జరిగిపోయింది పరిస్తితి చేజరిపోయిందని అనిపించింది. ఆ సంగటన జరిగిన వాతావరణంలో ఎంతో మంది తమ ప్రాణాలని కోల్పోయారు, మరికొంతమంది కోల్పోడానికి సిద్దంగా వున్నారు. ఇంకొంతమంది తమరికి ఎవరైనా సహాయం అందించక పోతారా అనని ఎదురు చూస్తున్నారు, మిగిలిన ఆ కొంత మంది కూడా ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు..
వారి కళ్ళల్లో దాగివున్న దీనమైన చూపులు బ్రతకాలని పరితపించే వారి ఆవేదనని చూసి కూడా ఒక్కరూ ముందుకు రాలేదు వాళ్ళని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడానికి! కనీసం అంబులన్స్ కి అయినా ఫోన్ చేసారో లేదో? అది కనుక్కునే సమయం కూడా నాదగ్గర లేదు ముందు నేను ఎలాగైనా సరే కనీసం మిగిలి వున్న ప్రాణాలని అయినా కాపాడాలని అనుకున్నాను.
ముందడుగు వేశాను.... నా అడుగు వేయడం పూర్తికాకుండానే అరె ఎక్కడికి బాబు ముందుకు వెళ్తున్నావు అది సంఘటన జరిగిన ప్రదేశం! అక్కడికి వెళ్తే నీ వేలి ముద్రలు కూడా పడతాయి మళ్లీ నువ్వుకూడా కోర్ట్ లూ కేసులు అంటూ జైళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది రా వెనక్కి వచ్చి మాతోపాటు ఇక్కడే నుంచుని చూడు..
అదేమన్నా తోలుబొమ్మలాట? వెనకే వుండి చూడటానికి? అననిపించింది. అయినా సహాయం చేస్తే ఆ వేలిముద్రల వల్ల మనం కూడా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పిన ఆమె తెలివికి మెచ్చుకోవాలో ఏడవాలో నాకు అర్థమే కాలేదు. ఆమె మాటలని పట్టించుకోకుండా దగ్గరికి చేరుకునేలోపే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటూ మా ఆయన చనిపోయరే కాపాడండి అయ్యా కాపాడండి, కనీసం మమ్మల్ని అయినా కాపాడి పుణ్యం కట్టుకోండి అయ్యా..! అననే ఆర్తనాదాల వినికిడికి నా చెవులు ముసుకునిపోయి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి.
ముందుగా 108 కి కాల్ చేసి పరిస్తితి వివరించాను. అంత విషాదకరమైన సంఘటనని చూసాక కూడా ఒక్కరికీ మనసు కరగటంలేదు, ఎవరూ ముందుకు రావడంలేదు సహాయం చేయటానికి.
మనం ఇంకా మనిషికి మనిషికి సహాయం చేసుకునే కాలంలోనే బ్రతుకుతున్నామా? లేక జంతువుల లాగా అడవిలో బ్రతుకుతున్నామా ? అనని ఒక్కసారిగా సందేహం వేసింది.
కనీసం అంబులన్స్ వచ్చేలోపల ఫస్ట్ఎయిడ్ చేసి కొంత మందిని అయినా కాపాడాలని ప్రయత్నించాను కానీ నన్ను ముందుకు వెళ్ళనీయకుండా ఆపే ఈ సైనుకుల నుండి తప్పించుకుని వెళ్ళడానికి పట్టే సమయంలో ఇంకొంత మంది ప్రాణాలను కోల్పోయేలా వున్నారు. చివరికి అంబులెన్సు రానే వచ్చింది కానీ ప్రయోజనమే లేకపోయింది అప్పటికే ఒక్కరి నుంచి సహాయం అందక అందరూ చనిపోయారు. నా కన్నీటికి అడ్డు లేకుండా పోయింది. కనీసం ఒక్కరి ప్రాణాలను కూడా కాపాడలేకపోయిన నా ప్రాణాలు వున్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే ? ఇంక నేను చేసేదేమీ లేక మనసులోనే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాను.
ఓ ప్రియ్తమైన స్నేహితులారా ! మీరు ఏ లోకంలో వున్నా మీ మనసుకి ప్రశాంతత కలగాలని కోరుకుంటూ
విశ్రాంతి కలిగి హాయిగా నిదురించాలని ఆసిస్తూ సహాయం చేయలేకపోయిన ఓ అజ్ఞాత వ్యక్తి.
So friends! I am requesting you to please help others when they are in need...
At least don't stop others when they are ready to do help. please leave them freely TO DO HELP.
Let's Try to do Help..! (or) Leave others to do help..!
ఇది నిజమైన కధ కాకపోవచ్చు కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం జరగడం లేదు అనుకోకండి, ఈ లోకంలో కొంతమంది సహాయం చెయ్యరు చేసేవాళ్ళని చెయ్యనివ్వరు అది బహుశా భయం వల్ల కావచ్చు లేదా ఆ సంఘటన జరిగింది నా వాళ్ళకి కాదుగా అననుకోవచ్చు మరింకేదైనా కారణం కావచ్చు. అలాంటి వాళ్ళ మాటలను లెక్కచేయకుండా మీ వంతు సహాయం చేయాలని ఒక భారతీయ పౌరుడిగా మీ భాద్యతని మీరు నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మీ Teju Innovations....!
No comments:
Post a Comment