- An Orphan Love Between Beautiful Parents & A Small Kid
------------------------------------------------------------------------------------------------------------------------
కొత్తగా పెళ్ళి చేసుకుని ఆనందంగా మహేష్ బాబు మరియు సమంతల సినిమా చూసుకుని బైక్ మీద వస్తున్నారు రవి మరియు రాగిణి. చల్లని గాలి, వెనక సీట్ లో తను ఎంతగానో ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్య తనను హత్తుకుని మరీ కూర్చుని కబుర్లు చెప్తూ వుంది. జోరుగా గాలి మొదలైంది రవి బండి నడపలేక ఒక పక్కన ఆపాడు గాలి తగ్గాక బయలుదేరదాము అనని. ఇంతలో చిన్న చిన్న చినుకలతో మొదలైంది వర్షం, అసలే కొత్తగా పెళ్ళి అయిన జంట దానికితోడు చీకటితో కూడుకున్న వర్షం, ఆ రాత్రి వేళలో... ఇంకేం కావాలి, ఒక మంచి వాన సాంగ్ వేసుకున్నారు. పూర్తిగా ఆనందంలో మునిగిపోయారు ఇద్దరూ.
ఇంతలో హటాత్తుగా అరుపులతో ఒక అమ్మాయి పరిగెత్తడం, వెనక నలుగురు మనుషులు ఆమెను తరుముతూ వెళ్ళడం చూసి బయంతో రొమాంటిక్ మూడ్ కాస్త terrific మూడ్ గా మారిపోయి వేగంగా బండిని నడిపాడు. వెళ్ళడానికి వీలులేకుండా దారి మద్యలో అడ్డుగా ఒక చెట్టు రోడ్డు మీద వాలిపోయింది బహుశా జోరుగా వీచిన గాలి వల్ల అయివుండవచ్చు కానీ అది నేను వెళ్లే దారిలోనే పడాలా? వెళ్ళడానికి అడ్డుగా వుంది. బండిని పక్క నుంచి తోలడానికి ప్రయత్నించాడు కానీ అసలే చిన్న సందు అదీకాక వర్షంలో మునిగి తేలుతున్న గుంతలు, manholes లో నుంచి బయటకి వచ్చే నీరు, రోడ్డు అంత నీళ్ళతో నిండి వుండటం వల్ల ఎక్కడ ఏం వుందో అనని బయపడి కష్టమైనా చెట్టునే తొలగించటానికి ప్రయత్నించాడు తన భార్య రాగిణితో కలిసి.... భారీగా వర్షం రాకపోయినా మన వూర్లల్లో సరిగ్గా వేయని రోడ్లు, వాటి పక్కన పెద్ద పెద్ద బావిల్లా వుండే manholes అబ్బా,.... ఎలా ఉంటాయో మనకి తెలుసుకదా ...!
జాగ్రత్తగా చెట్టుని తోయి అనని చెప్తున్న రవి మాటలు పుర్తికానేలేదు, ఇంతలో ఆకస్మికంగా రాగిణి జారి పడసాగింది ఆమెను పడకుండా చేత్తో ఆపుతూ జాగ్రత్త అని హెచ్చరించి హితబోద చేసాడు. హెచ్చరించి నిమిషం కూడా కాలేదు తనకే బాలన్స్ తప్పి కింద పడ్డాడు రవి. రాగిణి పక పక నవ్వి పక్కన వాళ్ళకి చెప్పడం కాదు ముందు మనం జాగ్రత్తగా వుండాలి అని అంది చిరుమందహాసంతో.
మీ అమ్మాయిలు వున్నారే మా అబ్బాయిల మాటలను ఎప్పుడూ అర్ధం చేసుకోరు - కాస్త పాజిటివ్ గా ఆలోచించండే! - నువ్వు కింద పడకుండా ఆపింది నేను...! కానీ నేను పడిపోతే నవ్వుతావా? చేయి ఇవ్వు అని చిరుకోపంతో అడిగాడు.
సరేలే ఎప్పటికైనా నా సహాయం లేనిదే మీరు పైకి కూడా లేవలేరు అంది రాగిణి, అబ్బో చాల్లే ఇప్పటికే వినలేక పాప గుక్కపెట్టి ఏడుస్తోంది ఇంక ఆపకపోతే నేను కూడా ఏడవటం మొదలు పెట్టాల్సి వస్తుంది.
అవునండోయ్...! చూసావా? ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావ్, అది చాలు నాకు ఈ జన్మకి.
ఉహూ...! మీ బొంద నిజంగానే పాప ఏడుపు వినిపిస్తోందండి, ఇంత రాత్రి వేళలో, చీకటిలో, అదీ వర్షంలో, ఎక్కడి నుంచి అండి ఈ పాప ఏడుపు? నన్ను అడిగితే నాకేం తెలుసు దగ్గరలో ఇళ్ళు కూడా ఏమీ లేవే ఎవరి పాప అయివుంటుంది. ముందు చూద్దాం పదండి. సరే పద వెతుకుదాం ముందు పాపని.
ఒక పెద్ద రావి మరియు వేపాకు కలిసి పెరిగిన చెట్టు మొదలులో ఆ పాప ఏడుపు వినిపించింది. దగ్గరకి వెళ్లి చూసారు రవి మరియు రాగిణిలు. చెట్టు అడవికి దగ్గరలో వుండటం మరియు వర్షం కారణo గానేమో ఒక పాము ఆ పాపకి దగ్గరలో వుంది బయంతో ఎక్కడ ఆ పాము పసిబిడ్డను కాటేస్తుందో అనని బయపడి ఇద్దరూ జోరుగా పరిగెత్తి కాపాడసాగారు, కానీ పాము పాప రక్షణ కోసమే వున్నట్టు పడగ విప్పి ఆశీర్వదించి మరీ వెళ్ళిపోయింది.
ఎంతైనా తల్లి మనసు కదా! ఎంత పెద్ద ప్రమాదం తప్పిందే నా చిట్టి తల్లి అని అంటూ హటాత్తుగా ఆ పాప ని గుండకి హత్తుకుంది రాగిణి. రవి ముబావిగా మొహం పెట్టుకుని ఎప్పుడైనా నన్ను అలా ఒక్కసారైనా గుండెకి హత్తుకున్నావా? అనని అంటూ ఓరకంటి చూపుతో తనవైపు చూసాడు. దేవుడా అని ఊపిరి గట్టిగా పీల్చుకుని తిట్టబోతుంటే....వాళ్ళ గోలలో వాళ్ళు వుండి తనని పట్టించుకోవటం లేదు అనని కాబోలు మద్యలో నేనొకదాన్ని వున్నాను అని గుర్తుచేస్తూ పాప ఏడుపు ఆపి నవ్వుతూ వాళ్ళిద్దరినీ పలకరించింది. అప్పుడే పాప ని చూసారు వాళ్ళిద్దరూ ఆ అందమైన తేజస్సుతో కూడిన పాప మొహం చీకటిలో కూడా ఏ మాత్రం వెలుగు తగ్గకుండా మెరిసిపోతువుంది. నిజంగా లక్ష్మీ సరస్వతీ దేవతల అంశతో పుట్టిన శక్తి అవతారం లా కనిపించింది వాళ్ళిద్దరికీ ఆ పాప.
రాగిణి ఎంతో సంతోషంగ పాపను ఎత్తుకుని ఆడిస్తూ చిన్నూ, బంగారం వస్తావా మా ఇంటికి తీసుకెళ్తాను అని అంటూ ముద్దు చేసింది. హా అవునవును ముందు నువ్వు రామ్మా మా ఇంటికి వెనకాలే మీ అమ్మ వస్తుంది పోలీసులతో. హ్మ్... అంత వెటకారం అక్కర్లేదు. లేకపోతే ఈమె తీసుకెల్తుందంట పాప రావలంట - బానే వుంది సంబరం, మీ రాకపోకలతో నేను జైలు చుట్టూ తిరగాల్సి వస్తుందేమో.! అలా ఏం కాదు పాప వల్ల ఎవరికైనా మంచే గాని చెడు జరగదు. ఏ చిలక జ్యోతిష్యుడు చెప్పాడమ్మా ఈ మాటలు.
పాప మొహం చూస్తుంటే మీకు వదిలేసి వెళ్ళాలని అనిపిస్తోందా? చెప్పండి. ప్లీజ్ అండి మనతో తీసుకుని వెళ్దాం. నాకు కూడా మనతో పాటే తీసుకెళ్ళాలని వుందే కానీ వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే ఏం చెప్తావ్
నా పాపని ఎందుకు తీసుకొచ్చారు
సారీ
ఎందుకు దొంగతనంగా తెచ్చారు అని పోలీసులతో వస్తేనో?
అప్పుడు ఏమని చెప్తావ్? చూడు ఆ పాప ఎవరో మనకి తెలీదు కేవలం ఈ కొంచం సమయానికే అంత తల్లి ప్రేమని వలకపోయకు అన్నాడు రవి కాస్త గంభీరంగా.
సరేలే అలా అయితే అంది రాగిణి ఏడుపు మొహం పెట్టి. పద వెళ్దాం ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఏంటి ఎక్కడికి వెళ్ళేది పాపని వాళ్ళ అమ్మకి జాగ్రత్తగా అప్పగించేదాకా ఈ పాపని వదిలి నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అంది. ఉహూ.... ఈ చీకటిలో ఎక్కడని వెతుకుతావే ఆమె కోసం నాకు అదంతా తెలీదు/
దేవుడా...! సరే నీ ఇష్టం వచ్చినట్టే కానీ. . అని చెప్పి అలాగే బైక్ మీద కూర్చుని తనకి తెలియకుండానే నిద్రపోయాడు రవి. రాగిణి మాత్రం ఆ పాపతో అలాగే తెల్లవారే వరకూ ఆడుతూ సమయాన్ని గడిపేసింది. చెట్టు మీద నుంచి ఆకు మొహం మీద పడి ఏదో దెయ్యం మీద పడినట్టు అరుస్తూ నిద్ర లేచాడు రవి. కనీసం తన అరుపులను కూడా వినిపించుకోకుండా పాపతో అడుకుంటోంది రాగిణి. ఇలాగే వదిలేస్తే ఎక్కడ తను పిచ్చిది అయిపోతుందో అనని పలకరించి పద ఇంక ఇంటికి వెళ్దాం ఎన్నాళ్లని ఇక్కడే వుంటావ్ అన్నాడు రవి. పదండి వెళ్దాం అని పాపను ఎత్తుకుని హుషారుగా బండి ఎక్కింది.
తర్వాత పాప గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చారు కానీ తనకు సంబందించిన వాళ్ళెవరు రాలేదు. ఆ పాప వచ్చిన వేళా విశేషమో ఏమో రవికి బిజినెస్ లో చాలా కలిసి వచ్చింది, రాగిణి గర్బవతి అవటం ఇంకా సొంతంగా పెద్ద luxury ఇల్లు కట్టుకోవటం తో పాటు అడిగిన వారికి లేదనకుండా ఆ పాప పేరు మీద అన్నదానం చేసే స్టేజి కి ఎదిగాడు రవి. కానీ పిచ్చిదానిలాగా కనీసం నాకు కూడా చెప్పకుండా ఆ పాపకోసం హాస్పిటల్ కు వెళ్లి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని రావటం నిజంగా నా బార్య మూర్ఖత్వమే. కానీ తన బార్య పాప మీద చూపించే పిచ్చి ప్రేమను చూసి ఎక్కడ పాపకు సంబందించిన వాళ్ళు వచ్చి పాపని తీసుకెల్తారో - అలా జరిగితే రాగిణి ఎమైపోతుందా అనని బయంతో రవికి దిగులు పట్టుకుంది\.
మళ్లీ కొన్నాళ్ళకు ముగ్గురూ సినిమా చూసుకుంటూ అదే దారిలో వస్తుండగా పెద్ద వర్షం, పాప దొరికినప్పుడు పడ్డ వర్షంలాగా పెద్ద పెద్ద ఉరుములతో వర్షం మొదలైంది అది చూసి రాగిణి బయంతో తన బర్త చొక్కాను పట్టుకుని గుంజుతూ నాకు చాలా బయంగా వుందండి పాపని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకుని వెళ్లారు కదా అనంది ఏడుస్తూ.. తను ఏడుస్తుంటే చూడలేక ఇలా జోక్ గా - ముందు నా చొక్కాని ఉతకడం ఆపు అన్నాడు రవి. అబ్బా నాకు చాలా బయంగా వుంది తొందరగా పదండి అంది రాగిణి. ఇక్కడే వుండు మళ్లీ ఇంకో పాప దొరుకుందేమో చూద్దామా? కారు కిందకి దిగి అన్నాడు చమత్కారంగా. మీ జోకులు ఆపి కార్ పోనివ్వండి అంది. కారు స్టార్ట్ చేసేలోపే ఎవరో ఒక అమ్మాయి వచ్చి పాపని రాగిణి చేతుల్లోనుంచి లాక్కుని పాపకి ముద్దులు పెడుతూ ఎన్నాళ్ళు అయిందమ్మ నిన్ను చూడక ఎలావున్నవే నా చిట్టి తల్లి అని ఏడవసాగింది, అది చూసి కోపంగా నా బిడ్డని లాక్కుని ఏడవటానికి ఎవరు నువ్వు హా ?
ఇవ్వు ఇలా నా పాపను అంది పెద్దగా అరుస్తూ రాగిణి.... అవునమ్మా ఈ పాప మీ పాపే, అనాధ అస్సలే కాదు, తిసుకోమ్మా నీ బిడ్డని, తప్పైపోయింది క్షమించండమ్మా అనని చెప్పి రవి పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆగకుండా వెళ్ళిపోయింది.
తర్వాత రోజు ఆ పాప తల్లి రైలు పట్టాల కింద పడి చనిపోయినట్లు పోలిసుల ద్వారా అందిన వార్తతో ఆ పాపను అందరి సమక్షంలో రవి రాగిణులు దత్తతు తీసుకుని తమ సొంత పాపకంటే కూడా ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు.
ఆ రోజు కనిపించి రాగిణి చెత్తుల్లొనుంచి పాపను తీసుకుని ఏడ్చిన ఆమె పాపతల్లా? నిజంగా ఆ పాప ఎవరో, తన తల్లి ఎవరో తెలియకపోయినా, పాపను వాళ్ళిద్దరూ కన్నబిడ్డలాగా పెంచుకోవటం చుస్తే పాపతల్లి ఏలోకంలో వున్నా, ఎక్కడ వున్నా సంతోషిస్తుంది.
so my dear friends, మీకు కూడా ఎవరైనా పసి పిల్లలు రోడ్డు పక్కనో, తల్లి దండ్రులు పెంచలేక వదిలేస్తేనో లేదా మరేదైనా కారణంగా ఏ పసికందైనా కనబడితే మనకెందుకులే శ్రమ అని అనుకోకుండా చేతనైనంత సహాయం అందించమని అర్దిస్తున్నాను
లేదా
కుదిరితే వాళ్ళని పిల్లల అనాధాశ్రమంలో చేర్చి ఒక భారత పౌరుడిగా మీ వంతు సహాయం చేర్చల్సిందిగా కోరుకుంటున్నాను.
ఇదీ ఫ్రెండ్స్ ఈ వారం కధ, మళ్లీ ఇంకో కొత్త కధతో మళ్ళి కలుద్దాం. మీ విలువైన కామెంట్స్ ని పోస్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దే...
Signing of by Teju Innovations Read Our Next Story
********************************************************************************
No comments:
Post a Comment