Lonely Murmuring (ఒంటరి గుసగుసలు)
Me, My Dairy, My Page...! (నేను, నా డైరీ, నా పేజి....!)------------------------------------------------------------------------------------------------------------------------------------
బాధలో వున్నప్పుడు అందరూ ఉన్నా నేను ఒంటరి జీవినే..! ఎప్పుడూ నా బాధని దీనిలోనే వ్యక్తపరుస్తుంటాను- నా డైరీలో ! అదేంటో, చాలా బాధగా ఏడుస్తున్నప్పుడే నాకు డైరీ రాయాలనిపిస్తుంది, అది కూడా అందంగా అలంకరించిన డైరీ లో కాదండోయ్ ఒక చిత్తు పేపర్ మీద, ఎవరికీ కనిపించనంత చిన్న అక్షరాలతో రాస్తుంటాను, రెండో రోజు చదివితే నా రాత నాకు కూడా అర్ధం కాకూడదు అని.....!
ఈ రోజు ఎందుకో తెలీదు గాని చాలా చాలా బాధగా వుంది ఎందుకు ఈ సమాజంలో వున్న అందరూ నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు లేదా నేనే అలా అలోచిస్తున్నాన? అర్ధం కావట్లేదు. ఏదైతేనే అందరూ ఎదుటి వారిని ఉపయోగించుకోవాలి అని అనుకునేవారే, నా నుంచి మాత్రం అందరికీ సహాయం చేయించుకుంటారు తీరా నాకు సహాయం చేయాల్సివస్తే మాత్రం ఒక్క చెయ్యి ముందుకు రాదు. ఈ సమాజంలో అందరూ ఇంతేనా?
అమ్మ ఎప్పుడూ చెప్తూనే వుంటుంది "నీకు చేతనైనంతలో సహాయం చేయి వాళ్ళకి సమయానికి సహాయం అందిందా? లేదా ? అంతే...! ప్రతిఫలంగా వాళ్ళేదో చేస్తారని చూడకు" అనని. కొసరుగా మా అమ్మ ఇంగ్లీష్ లో కూడా చెప్పింది "Never Expect Anything From Anybody...!"
వీళ్ళ ద్వారానే నాకు సహాయం అందింది అనని నలుగురికి చెప్పాలని కోరుకోవడం లేదు, కనీసం సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత అయినా చెప్పకపోగ వాళ్ళకే చెడు చేస్తున్నారు. నేను కూడా ఆ కోవకి చెందిన బాదితురాలినే - అందుకే నా బాధను ఈ డైరీ వంకతో మీతో పంచుకుంటున్నాను, డబ్బులు గాని ఇంకేమైనా సహాయం కావాలి అంటే మాత్రం నా మీద ఎంతో ప్రేమ వున్నట్టు లేని ప్రేమని ఏ సూపర్ మార్కెట్ నుంచి కొని తెస్తారో గాని, ఆపడానికి కూడా వీలులేనంత ప్రేమని వలకబోస్తారు.
వాళ్ళకి కావాల్సిన సహాయం అందాక హలో...! ఎవరిండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే, మీ మాట తెలిసిన వాళ్ళ మాట లాగా అనిపిస్తోంది మీకు నేను ముందే తెలుసా? మనకి ముందే పరిచయం వుందా అనని లేనిపోని చెత్త కవిత్వాలతో మాట దాటేసి తప్పించుకుని పారిపోతుంటారు. ఇదేనేమో కలికాలం అంటే .....
వాళ్ళకి కావాల్సిన సహాయం అందాక హలో...! ఎవరిండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే, మీ మాట తెలిసిన వాళ్ళ మాట లాగా అనిపిస్తోంది మీకు నేను ముందే తెలుసా? మనకి ముందే పరిచయం వుందా అనని లేనిపోని చెత్త కవిత్వాలతో మాట దాటేసి తప్పించుకుని పారిపోతుంటారు. ఇదేనేమో కలికాలం అంటే .....
కానీ కలికాలంలో కూడా బేధాలు వున్నట్టు వున్నాయి, అందరికీ ఇలాంటి కళలు రావు కొంతమంది మంచి వాళ్ళు వుంటారు వీళ్ళ చేతుల్లో మోసపోడానికి. వాళ్ళ లాగా కన్నింగ్ గా ఆలోచించలేరు. ఇంకొంత మంది తెలివిగా ప్రవర్తిస్తున్నాం అనుకకుంటారేగాని పాపం చివరికి వాళ్ళకే అర్తం కాకుండా మోసపోతారు. ఇలాంటి మనుషులతో మునిగిపోయిన ఈ సమాజంలో మంచి వారు కూడా 1% వున్నారు వాళ్ళ పరిస్థితి అచ్చం ఇలానే, చెరువులో వున్న చేప జాలరుల వేట వల్ల వలలో చిక్కుకుని బయట పడి కొత్త ప్రపంచంలో పోటీ పడలేక గిల గిలా కొట్టుకుని చచ్చిపోయినట్టు ఈ 1% మంచి వాళ్ళు కూడా అలాంటి మోసాలను పసికట్టలేక, పసిగట్టినా తెలివిగా తప్పించుకోలేక గిల గిలా కొట్టుకుంటూ ఆ సుడిగుండం నుంచి తనని బయట పడేసే చేయి కోసం ఆశతో వెతుకుతూ వుంటారు.
ఒక విధంగా చుస్తే ఈ తప్పంతా తల్లిదండ్రులదేనేమో, వాళ్ళేం చేసారు అని నన్ను తిట్టడం మొదలు పెట్టద్దండోయ్. వాళ్ళు చూసిన పాత రోజుల్లో అందరూ మంచి వారే వుండివుండొచ్చు కానీ ఇప్పటి రోజులకి తగ్గట్టు నన్ను పెంచకపోవడం వాళ్ళ తప్పు కాదంటారా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కాకుండా కాస్త బయటి ప్రపంచానికి నన్ను పరిచయం చేయకపోవడం, సమాజం లో ఇన్ని రకాల వింత మనుషులు వింతవింత ప్రవర్తనలు ఉంటాయని తెలియచెప్పకపోవడం, ఇన్ని మోసాలను నేను గ్రహించేలాగా చేయకపోవటం వాళ్ళ తప్పు కాదంటారా? కేవలం చదువుకూ ఇంటికీ పరిమితం చేయకపోతే ఇవన్నిటినీ కూడా నాకు తెలిసేలా చేస్తే హటాత్తుగా బయటికి వచ్చినప్పుడు కనీసం వేరే వాళ్ళ చేతుల్లో మోసపోకుండా జాగ్రత్త పడేలా వుపయోగపడేది కదా? కనీసం కాలేజీ పాటాలలో కూడా ఎక్కడా చదవలేదు ఇలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవటం అని.
బహుశా! వాళ్ళకీ మొదటి సారి కావొచ్చు ఇలాంటి మనుషులను చూడటం, పైపెచ్చు వాళ్ళు అనుకునివుండొచ్చు మా కూతురు చాలా తెలివిగల అమ్మాయి, ఎలాంటి పరిస్తుతలనైనా చిటెకలో పరిష్కరించగలదు అని, ఏ కారణం అయితేనేం ఇంత వయసు వచ్చాక ఏది మంచో? ఏది చెడో? ఎటు వైపు వెళ్తే మంచి జరుగుతుందో? కనిపెట్టే సామర్ద్యత నాకు కల్పించారు.
ఏది కారణం అయితేనేం ఇలాంటి వాళ్ళని ఎదుర్కుని సమాజంలో నిలబడగలగాలి. చెడు చేయాలి అననుకునేవాళ్ళకి సరియైన బుద్ది చెప్పలేకపోయినా నన్ను నేను కాపాడుకోవాలి వీలైతే ఇతరులకి తెలియజెప్పాలి, అంతేగాని పిరికి దానిలాగా ఇంట్లో కూర్చుని కాలాన్ని వెల్లబుస్తూ, నా తెలివి తేటలను అటక మీద పడేసి నాన్న తెచ్చిన సంబంధం చేసుకుని అత్తారింట్లో ఆ పని ఈ పని అంటూ అంట్లు తోమడం బట్టలు వుతకడం నా వల్ల అసలే కాదు.
చివరికి నాకు వచ్చింది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా వేరే వాళ్ళతో నా బాధ చెప్పి మళ్ళి వాళ్ళ చేతుల్లో కూడా మోసపోవటం ఇష్టం లేక నాలో నేనే ఒంటరిగా కూర్చుని గొనుక్కుoటూ ఇలా పెన్నులో ఇంకు అయిపోయేదాకా పేజీలకి పేజీలు చాటభారతం రాసేస్తూ వుంటాను, బాధ తగ్గి ఆలోచనా శక్తి వచ్చేదాకా...!
కనుక మీరు కూడా మీకు ఎప్పుడైనా బాధగ వున్నప్పుడు ఇలా ఒంటరిగా కూర్చుని మీలో మీరే మాట్లాడుకుంటూ సమస్యకి పరిష్కారం వెతకండి మొదట్లో మనసు బాధతో మెదడు నెగటివ్ దారి లో ఆలోచింపచేసినా తర్వాత చివరికి పాజిటివ్ గా ఆలోచిస్తారు - ఇది అసలు పెద్ద సమస్యే కాదే! నేను ఎందుకు ఇంతలా నా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నా అనని realize అయ్యి డైరీ ని ఆనందంగా మూసేసి రాయటం ఆపేసి అందరితో ఆనందంగా గడిపేస్తారు ఎప్పటిలాగా... !
మర్చిపోకండి సుమీ ఎవరూ లేనప్పుడే (లేదా) ఎవరూ లేని ఒంటరి ప్రదేశంలోనే మీలో మీరు మాట్లాడుకోండి లేదా, తనలో తానే మాట్లాడుకుంటున్నాడు వాడికేదో పిచ్చి పట్టినట్టు వుంది అననుకుంటారు చుసిన వాళ్ళు.
ఇదీ స్నేహితులారా నా డైరీ లోని ఒక బుజ్జి పేజి, మరి మీ పేజీ ని, కష్ట సుఖాలను, మెళకువలను కూడా మా అందరితో పంచుకుని మీ చుట్టూ వుండే అందరినీ మీ చిరకాల స్నేహితులుగా మలచుకోండి.
అందరికీ నా ధన్యవాదాలు.
***************************************************************************************************
***************************************************************************************************
-signing of by Teju Innovations.... Click Here To Read Our Next Story....
No comments:
Post a Comment