Tuesday, 26 May 2015

Let's TRY TO DO HELP (or) LEAVE OTHERS TO DO HELP..!


అరె చూడు చూడు నీళ్ళు... బలే ఎర్ర రంగులో వున్నాయే చూడు ఇలా(..
                చెప్పుకుంటూ ఆడుకుంటున్న చిన్న పిల్లలు..

                తీరా చూస్తే రక్తం, రోడ్డు నిండా జలపాతంలా కారుతుంది. 
      
ఏంటి ఈ రక్తం? ఎక్కడనుంచా? అని చుస్తూ రోడ్డు మీద వస్తూ పోయే వాళ్ళని విచారిస్తూ వుండగా రోడ్డుకి అడ్డంగా పెళ్లి బోజనాలకి వచ్చినట్టుగా గుంపులు గుంపులుగా నుంచుని వున్న జనాలను చూసి బహుశా ఏదో పెళ్ళో / నాటకమో జరుగుతుందేమో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న నా పాములాంటి చెవులకి "ఒక పెద్ద బస్సు ప్రమాదం జరిగిందట. బస్సు వెళ్లి ఒక పెద్ద లారి ట్రక్ కు గుద్డుకుందంట. అని మాటలు వినిపించాయి." 

ఆరా తీసి వెళ్లి చుస్తే... గుంపులు గుంపులు నుంచుని అందరూ వింతగా చూస్తున్న ఆ నాటకం ఇదే! కానీ నేను వెళ్ళే సరికే సగం ఘోరం జరిగిపోయింది పరిస్తితి చేజరిపోయిందని అనిపించింది.  ఆ సంగటన జరిగిన వాతావరణంలో ఎంతో మంది తమ ప్రాణాలని కోల్పోయారు, మరికొంతమంది కోల్పోడానికి సిద్దంగా వున్నారు. ఇంకొంతమంది తమరికి ఎవరైనా సహాయం అందించక పోతారా అనని ఎదురు చూస్తున్నారు, మిగిలిన ఆ కొంత మంది కూడా ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు..  

వారి కళ్ళల్లో దాగివున్న దీనమైన చూపులు బ్రతకాలని పరితపించే వారి ఆవేదనని చూసి కూడా ఒక్కరూ ముందుకు రాలేదు వాళ్ళని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడానికి! కనీసం అంబులన్స్ కి అయినా ఫోన్ చేసారో లేదో? అది కనుక్కునే సమయం కూడా నాదగ్గర లేదు ముందు నేను ఎలాగైనా సరే కనీసం మిగిలి వున్న ప్రాణాలని అయినా కాపాడాలని అనుకున్నాను. 
         ముందడుగు వేశాను....  నా అడుగు వేయడం పూర్తికాకుండానే అరె ఎక్కడికి బాబు ముందుకు వెళ్తున్నావు అది సంఘటన జరిగిన ప్రదేశం! అక్కడికి వెళ్తే నీ వేలి ముద్రలు కూడా పడతాయి మళ్లీ నువ్వుకూడా కోర్ట్ లూ కేసులు అంటూ జైళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది రా వెనక్కి వచ్చి మాతోపాటు ఇక్కడే నుంచుని చూడు..  
       అదేమన్నా తోలుబొమ్మలాట? వెనకే వుండి చూడటానికి? అననిపించింది. అయినా సహాయం చేస్తే ఆ వేలిముద్రల వల్ల మనం కూడా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పిన ఆమె తెలివికి మెచ్చుకోవాలో ఏడవాలో నాకు అర్థమే కాలేదు.  ఆమె మాటలని పట్టించుకోకుండా దగ్గరికి చేరుకునేలోపే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటూ మా ఆయన చనిపోయరే కాపాడండి అయ్యా కాపాడండి, కనీసం మమ్మల్ని అయినా కాపాడి పుణ్యం కట్టుకోండి అయ్యా..! అననే ఆర్తనాదాల వినికిడికి నా చెవులు ముసుకునిపోయి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. 
ముందుగా 108 కి కాల్ చేసి పరిస్తితి వివరించాను.  అంత విషాదకరమైన సంఘటనని చూసాక కూడా ఒక్కరికీ మనసు కరగటంలేదు, ఎవరూ ముందుకు రావడంలేదు సహాయం చేయటానికి.
మనం ఇంకా మనిషికి మనిషికి సహాయం చేసుకునే కాలంలోనే బ్రతుకుతున్నామా? లేక జంతువుల లాగా అడవిలో బ్రతుకుతున్నామా ? అనని ఒక్కసారిగా సందేహం వేసింది.  
కనీసం అంబులన్స్ వచ్చేలోపల ఫస్ట్ఎయిడ్  చేసి కొంత మందిని అయినా కాపాడాలని ప్రయత్నించాను కానీ నన్ను ముందుకు వెళ్ళనీయకుండా ఆపే ఈ సైనుకుల నుండి తప్పించుకుని వెళ్ళడానికి పట్టే సమయంలో ఇంకొంత మంది ప్రాణాలను కోల్పోయేలా వున్నారు. చివరికి అంబులెన్సు రానే వచ్చింది కానీ ప్రయోజనమే లేకపోయింది అప్పటికే ఒక్కరి నుంచి సహాయం అందక అందరూ చనిపోయారు. నా కన్నీటికి అడ్డు లేకుండా పోయింది. కనీసం ఒక్కరి ప్రాణాలను కూడా కాపాడలేకపోయిన నా ప్రాణాలు వున్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే ? ఇంక నేను చేసేదేమీ లేక మనసులోనే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాను. 

ఓ ప్రియ్తమైన స్నేహితులారా ! మీరు ఏ లోకంలో వున్నా మీ మనసుకి ప్రశాంతత కలగాలని కోరుకుంటూ 
                               విశ్రాంతి కలిగి హాయిగా నిదురించాలని ఆసిస్తూ సహాయం చేయలేకపోయిన ఓ అజ్ఞాత వ్యక్తి.  
                                                                                 
  
So friends! I am requesting you to please help others when they are in need...
At least don't stop others when they are ready to do help. please leave them freely TO DO HELP.  


Let's Try to do Help..! (or) Leave others to do help..!
    

ఇది నిజమైన కధ కాకపోవచ్చు కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం జరగడం లేదు అనుకోకండి, ఈ లోకంలో కొంతమంది సహాయం చెయ్యరు చేసేవాళ్ళని చెయ్యనివ్వరు అది బహుశా భయం వల్ల కావచ్చు లేదా ఆ సంఘటన జరిగింది నా వాళ్ళకి కాదుగా అననుకోవచ్చు మరింకేదైనా కారణం కావచ్చు. అలాంటి వాళ్ళ మాటలను లెక్కచేయకుండా మీ వంతు సహాయం చేయాలని ఒక భారతీయ పౌరుడిగా మీ భాద్యతని మీరు నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మీ Teju Innovations....! 




                              

Understanding Love


(A speechless understanding love between wife & husband )

--------------------------------------------------------------------------------------------------------

ప్రేమ్ చేతులు ఐశ్వర్య చీరను వెతుకుతున్నాయి... ఎందుకో తెలుసా?                         అలారం ప్రొద్దున్నే 5 గంటలకు చిన్న కూతతో మోగీ మోగగానే టక్కున నిద్ర లేచి తన పక్కన గురక పెట్టి మరీ పడుకొని వున్న తన భార్య చీరను తడిమి, తన మొహం కనపడకుండా అడ్డుగా వున్న వెంట్రుకలను పక్కకు తీసి, 5 నిమిషాల పాటు తన మొహాన్ని కన్నార్పకుండా చూస్తూ            తన తల మీద ప్రేమతో ఒక చిన్న ముద్దు పెట్టి,           ఐ లవ్ యు డార్లింగ్,           మేరి జానూ ...,,, 
          స్వీట్ హార్ట్           నేను నిన్న ఏమైనా అనుంటే సారీ రా ప్లీజ్ క్షమించేయ్... పర్వాలేదులే నీ మొగుడినేగా క్షమించేయ్ లే(..... 
          అని చిన్నగా చెవిలో చెప్పి మళ్ళి నిద్రపోతాడు ప్రేమ్.                   
ఆ స్పర్శకి, తను చెప్పే గుసగుసలకి గురక పెట్టి మరీ నిద్రపోతున్న ఐశ్వర్య నిద్ర లేచి ప్రేమ్ మొహాన్ని చూస్తూ హ్మ్.... నేను నిన్నే మర్చిపోయానులే. నిన్న మనం పడ్డ గొడవలు అన్నీ, నిన్నే మెమరీ కార్డు నుంచి డిలీట్ చేసేసాను.  దేవుడా లేస్తూ లేస్తూ ఈ కంప్యూటర్ గోల ఏంటే.....?  

ఐశ్వర్య  :  అయినా నాకు కావాల్సింది నీ సారీ కాదు, 
ప్రేమ్మ   :  మరి ఇంకో ముద్దు కావాలా? 
ఐశ్వర్య :  దీనికేం తక్కువ లేదు....  సరేబాబు నాకు వంట గదిలో చాలా పని వుంది నేను వెళ్ళాలి వదులు అనని తన               చీర చెంగును ప్రేమ్ చేతిలో నుంచి లాక్కుని వెళ్ళిపోయింది.
ప్రేమ్   :  హేయ్ ఇదిగో ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్ ? నేను లేకుండా నువ్వు వంట చేయటం ఎప్పుడు నేర్చుకున్నావ్                అసలు  ?
ఐశ్వర్య : నేను ఎక్కడ చేస్తున్నాను వంట దా... నువ్వే చేయి!
ప్రేమ :    అది సంగతి ఇంకా నువ్వు వంట చేస్తున్నవేమో అని బయపడ్డా !  
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది, పాలవాడేమో అనని తలుపు తీసింది ఐశ్వర్య చుస్తే అత్తా మామ వచ్చారు అనుకోని పెళ్ళికి పేరంటాళ్ళు వచ్చినట్టు.  వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకోవడంతో ప్రేమ్ వైపు చుట్టాలు గానీ ఐశ్వర్య వైపు చుట్టాలు గాని రాకపోకలు లేవు. హటాత్తుగా ఏమైందో గాని వేకువజామునే ప్రత్యక్షమయ్యారు. ఏంటి అమ్మాయ్ మమ్మల్ని లోపలికి పిలవ్వా అని అన్న తోడికోడలు  మాటలు విని షాక్ లో నుంచి తేరుకుని అదేం లేదు అత్తయ్యగారు రండి లోపలికి అని పిలిచింది. 

 



   

Sunday, 17 May 2015

Crazy Love Between Crazy People


( Kids - its a bit terrific story please careful before reading  )



 ఆ రాత్రి అమావాశ్య - కారుమబ్బులతో కమ్ముకునిపోయిన చీకటి రాత్రి అది /.....

    ఆ  అర్ధరాత్రిలో  పల్లెటూరిలో,  స్మశానంలో శవాల మద్యలో కూర్చుని ప్రేమించుకుంటున్న ఇద్దరు మనుషులు బహుశా ప్రేమికులు కావచ్చు - అని చెప్పుకుంటారే తప్ప దగ్గరకి వెళ్ళి చూసే దైర్యం ఎవరికీ లేదు. 

కొంత మంది అయితే ఆ ఊరిని రోజు రాత్రి వేళలో వచ్చి ఏ భూతల బారిన పడకుండా కాపాడటానికి వచ్చిన అదృశ్య శక్తులు అని చెప్తుంటారు ఆ మాటలకి విరుగుడుగా ఇంకొంత మంది - అయితే గుళ్ళో ఉండాలి కానీ స్మశానంలో ఎందుకు వుంటున్నారు అందులోనూ ఇద్దరు కావాలా?కాపాడటానికి?  అని విమర్శిస్తూ వుండే వారూ వున్నారు.  

నిజంగా వాళ్ళు దెయ్యాలా? లేక మనుషులా? -- అని తెలుసుకోవాలని ప్రయత్నించే టీవీ చానళ్ళు.  టీవీ చానళ్ళ వాళ్ళు ఎప్పుడు కనుక్కుంటారో? ఏమని తేల్చి చెప్తారో? అనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనవాసులు.

       ఇంతకీ  మీరు కూడా వాళ్ళు దయ్యలేమో అనని బ్రమపడుతున్నారా...! నో నో వాళ్ళు ఎవరో కాదండి మన క్రేజీ కధలోని క్రేజీ  ప్రేమికులు అదేంటో కొంతమంది క్రేజీగా ఆలోచిస్తూ క్రేజీ పనులే చేస్తుంటారు అలంటి వాళ్ళల్లో ఈ జంట ఒకటి,,


 
          

Tuesday, 12 May 2015


Lonely Murmuring (ఒంటరి గుసగుసలు)

Me, My Dairy, My Page...! (నేను, నా డైరీ, నా పేజి....!)
------------------------------------------------------------------------------------------------------------------------------------
                     బాధలో వున్నప్పుడు అందరూ ఉన్నా నేను ఒంటరి జీవినే..! ఎప్పుడూ నా బాధని దీనిలోనే వ్యక్తపరుస్తుంటాను- నా డైరీలో !  అదేంటో, చాలా బాధగా ఏడుస్తున్నప్పుడే నాకు డైరీ రాయాలనిపిస్తుంది, అది కూడా అందంగా అలంకరించిన డైరీ లో కాదండోయ్ ఒక చిత్తు పేపర్ మీద, ఎవరికీ కనిపించనంత చిన్న అక్షరాలతో రాస్తుంటాను, రెండో రోజు చదివితే నా రాత నాకు కూడా అర్ధం కాకూడదు అని.....!

              ఈ రోజు ఎందుకో తెలీదు గాని చాలా చాలా బాధగా వుంది ఎందుకు ఈ సమాజంలో వున్న అందరూ నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు లేదా నేనే అలా అలోచిస్తున్నాన? అర్ధం కావట్లేదు. ఏదైతేనే అందరూ ఎదుటి వారిని ఉపయోగించుకోవాలి అని అనుకునేవారే, నా నుంచి మాత్రం అందరికీ సహాయం చేయించుకుంటారు తీరా నాకు సహాయం చేయాల్సివస్తే మాత్రం ఒక్క చెయ్యి ముందుకు రాదు.  ఈ సమాజంలో అందరూ ఇంతేనా?

అమ్మ ఎప్పుడూ చెప్తూనే వుంటుంది "నీకు చేతనైనంతలో సహాయం చేయి వాళ్ళకి సమయానికి సహాయం అందిందా? లేదా ? అంతే...!  ప్రతిఫలంగా వాళ్ళేదో చేస్తారని చూడకు" అనని. కొసరుగా మా అమ్మ ఇంగ్లీష్ లో కూడా చెప్పింది "Never Expect Anything From Anybody...!"

             వీళ్ళ ద్వారానే నాకు సహాయం అందింది అనని నలుగురికి చెప్పాలని కోరుకోవడం లేదు, కనీసం సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత అయినా చెప్పకపోగ వాళ్ళకే చెడు చేస్తున్నారు. నేను కూడా ఆ కోవకి చెందిన బాదితురాలినే - అందుకే నా బాధను ఈ డైరీ వంకతో మీతో పంచుకుంటున్నాను, డబ్బులు గాని ఇంకేమైనా సహాయం కావాలి అంటే మాత్రం నా మీద ఎంతో ప్రేమ వున్నట్టు లేని ప్రేమని ఏ సూపర్ మార్కెట్ నుంచి కొని తెస్తారో గాని, ఆపడానికి కూడా వీలులేనంత ప్రేమని వలకబోస్తారు.

           వాళ్ళకి కావాల్సిన సహాయం అందాక హలో...! ఎవరిండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే, మీ మాట తెలిసిన వాళ్ళ మాట లాగా అనిపిస్తోంది మీకు నేను ముందే తెలుసా? మనకి ముందే పరిచయం వుందా అనని లేనిపోని చెత్త కవిత్వాలతో మాట దాటేసి తప్పించుకుని పారిపోతుంటారు. ఇదేనేమో కలికాలం అంటే ..... 

             కానీ కలికాలంలో కూడా బేధాలు వున్నట్టు వున్నాయి, అందరికీ ఇలాంటి కళలు రావు కొంతమంది మంచి వాళ్ళు వుంటారు వీళ్ళ చేతుల్లో మోసపోడానికి. వాళ్ళ లాగా కన్నింగ్ గా ఆలోచించలేరు. ఇంకొంత మంది తెలివిగా ప్రవర్తిస్తున్నాం అనుకకుంటారేగాని పాపం చివరికి వాళ్ళకే అర్తం కాకుండా మోసపోతారు. ఇలాంటి మనుషులతో మునిగిపోయిన ఈ సమాజంలో మంచి వారు కూడా 1% వున్నారు వాళ్ళ పరిస్థితి అచ్చం ఇలానే,  చెరువులో వున్న చేప జాలరుల వేట వల్ల వలలో చిక్కుకుని బయట పడి కొత్త ప్రపంచంలో పోటీ పడలేక గిల గిలా కొట్టుకుని చచ్చిపోయినట్టు ఈ 1% మంచి వాళ్ళు కూడా అలాంటి మోసాలను పసికట్టలేక, పసిగట్టినా తెలివిగా తప్పించుకోలేక గిల గిలా కొట్టుకుంటూ ఆ సుడిగుండం నుంచి తనని బయట పడేసే చేయి కోసం ఆశతో వెతుకుతూ వుంటారు.

                  ఒక విధంగా చుస్తే ఈ తప్పంతా తల్లిదండ్రులదేనేమో, వాళ్ళేం చేసారు అని నన్ను తిట్టడం మొదలు పెట్టద్దండోయ్. వాళ్ళు చూసిన పాత రోజుల్లో అందరూ మంచి వారే వుండివుండొచ్చు కానీ ఇప్పటి రోజులకి తగ్గట్టు నన్ను పెంచకపోవడం వాళ్ళ తప్పు కాదంటారా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కాకుండా కాస్త బయటి ప్రపంచానికి నన్ను పరిచయం చేయకపోవడం, సమాజం లో ఇన్ని రకాల వింత మనుషులు వింతవింత ప్రవర్తనలు ఉంటాయని తెలియచెప్పకపోవడం, ఇన్ని మోసాలను నేను గ్రహించేలాగా చేయకపోవటం వాళ్ళ తప్పు కాదంటారా? కేవలం చదువుకూ ఇంటికీ పరిమితం చేయకపోతే ఇవన్నిటినీ కూడా నాకు తెలిసేలా చేస్తే హటాత్తుగా బయటికి వచ్చినప్పుడు కనీసం వేరే వాళ్ళ చేతుల్లో మోసపోకుండా జాగ్రత్త పడేలా వుపయోగపడేది కదా? కనీసం కాలేజీ పాటాలలో కూడా ఎక్కడా చదవలేదు ఇలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవటం అని. 

                   బహుశా!  వాళ్ళకీ మొదటి సారి కావొచ్చు ఇలాంటి మనుషులను చూడటం, పైపెచ్చు వాళ్ళు అనుకునివుండొచ్చు మా కూతురు చాలా తెలివిగల అమ్మాయి, ఎలాంటి పరిస్తుతలనైనా చిటెకలో పరిష్కరించగలదు అని,  ఏ కారణం అయితేనేం ఇంత వయసు వచ్చాక ఏది మంచో? ఏది చెడో? ఎటు వైపు వెళ్తే మంచి జరుగుతుందో? కనిపెట్టే సామర్ద్యత నాకు కల్పించారు. 

               ఏది కారణం అయితేనేం ఇలాంటి వాళ్ళని ఎదుర్కుని సమాజంలో నిలబడగలగాలి. చెడు చేయాలి అననుకునేవాళ్ళకి సరియైన బుద్ది చెప్పలేకపోయినా నన్ను నేను కాపాడుకోవాలి వీలైతే ఇతరులకి తెలియజెప్పాలి, అంతేగాని పిరికి దానిలాగా ఇంట్లో కూర్చుని  కాలాన్ని వెల్లబుస్తూ, నా తెలివి తేటలను అటక మీద పడేసి నాన్న తెచ్చిన సంబంధం చేసుకుని అత్తారింట్లో ఆ పని ఈ పని అంటూ అంట్లు తోమడం బట్టలు వుతకడం నా వల్ల అసలే కాదు.  

                 చివరికి నాకు వచ్చింది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా వేరే వాళ్ళతో నా బాధ చెప్పి మళ్ళి వాళ్ళ చేతుల్లో కూడా మోసపోవటం ఇష్టం లేక నాలో నేనే ఒంటరిగా కూర్చుని గొనుక్కుoటూ ఇలా పెన్నులో ఇంకు అయిపోయేదాకా పేజీలకి పేజీలు చాటభారతం రాసేస్తూ వుంటాను, బాధ తగ్గి ఆలోచనా శక్తి వచ్చేదాకా...! 

        కనుక  మీరు కూడా మీకు ఎప్పుడైనా బాధగ వున్నప్పుడు ఇలా ఒంటరిగా కూర్చుని మీలో మీరే మాట్లాడుకుంటూ సమస్యకి పరిష్కారం వెతకండి మొదట్లో మనసు బాధతో మెదడు నెగటివ్ దారి లో ఆలోచింపచేసినా తర్వాత చివరికి పాజిటివ్ గా ఆలోచిస్తారు - ఇది అసలు పెద్ద సమస్యే కాదే! నేను ఎందుకు ఇంతలా నా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నా అనని realize అయ్యి డైరీ ని ఆనందంగా మూసేసి రాయటం ఆపేసి అందరితో ఆనందంగా గడిపేస్తారు ఎప్పటిలాగా... ! 

           మర్చిపోకండి సుమీ ఎవరూ లేనప్పుడే (లేదా) ఎవరూ లేని ఒంటరి ప్రదేశంలోనే మీలో మీరు మాట్లాడుకోండి లేదా, తనలో తానే మాట్లాడుకుంటున్నాడు వాడికేదో పిచ్చి పట్టినట్టు వుంది అననుకుంటారు చుసిన వాళ్ళు.  


        ఇదీ స్నేహితులారా నా డైరీ లోని ఒక బుజ్జి పేజి, మరి మీ పేజీ ని, కష్ట సుఖాలను, మెళకువలను కూడా మా అందరితో పంచుకుని మీ చుట్టూ వుండే అందరినీ మీ చిరకాల స్నేహితులుగా మలచుకోండి. 

                                                              అందరికీ నా ధన్యవాదాలు.
***************************************************************************************************


-signing of by Teju Innovations....                               Click Here To Read Our Next Story....  

                      



Wednesday, 6 May 2015

Robo Love


Sensational Love Story


ORPHAN LOVE

- An Orphan Love Between Beautiful Parents & A Small Kid

------------------------------------------------------------------------------------------------------------------------

               కొత్తగా పెళ్ళి చేసుకుని ఆనందంగా మహేష్ బాబు మరియు సమంతల సినిమా చూసుకుని బైక్ మీద వస్తున్నారు రవి మరియు రాగిణి. చల్లని గాలి, వెనక సీట్ లో తను ఎంతగానో ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్య తనను హత్తుకుని మరీ కూర్చుని కబుర్లు చెప్తూ వుంది. జోరుగా గాలి మొదలైంది రవి బండి నడపలేక ఒక పక్కన ఆపాడు గాలి తగ్గాక బయలుదేరదాము అనని. ఇంతలో చిన్న చిన్న చినుకలతో మొదలైంది వర్షం, అసలే కొత్తగా పెళ్ళి అయిన జంట దానికితోడు చీకటితో కూడుకున్న వర్షం, ఆ రాత్రి వేళలో... ఇంకేం కావాలి, ఒక మంచి వాన సాంగ్ వేసుకున్నారు. పూర్తిగా ఆనందంలో మునిగిపోయారు ఇద్దరూ.

               ఇంతలో హటాత్తుగా అరుపులతో ఒక అమ్మాయి పరిగెత్తడం, వెనక నలుగురు మనుషులు ఆమెను తరుముతూ వెళ్ళడం చూసి బయంతో రొమాంటిక్ మూడ్ కాస్త terrific మూడ్ గా మారిపోయి వేగంగా బండిని నడిపాడు. వెళ్ళడానికి వీలులేకుండా దారి మద్యలో అడ్డుగా ఒక చెట్టు రోడ్డు మీద వాలిపోయింది బహుశా జోరుగా వీచిన గాలి వల్ల అయివుండవచ్చు కానీ అది నేను వెళ్లే దారిలోనే పడాలా? వెళ్ళడానికి అడ్డుగా వుంది. బండిని పక్క నుంచి తోలడానికి ప్రయత్నించాడు కానీ అసలే చిన్న సందు అదీకాక వర్షంలో మునిగి తేలుతున్న గుంతలు, manholes లో నుంచి బయటకి వచ్చే నీరు, రోడ్డు అంత నీళ్ళతో నిండి వుండటం వల్ల ఎక్కడ ఏం వుందో అనని బయపడి కష్టమైనా చెట్టునే తొలగించటానికి ప్రయత్నించాడు తన భార్య రాగిణితో కలిసి.... భారీగా వర్షం రాకపోయినా మన వూర్లల్లో సరిగ్గా వేయని రోడ్లు, వాటి పక్కన పెద్ద పెద్ద బావిల్లా వుండే manholes అబ్బా,....  ఎలా ఉంటాయో మనకి తెలుసుకదా ...!
               
                  జాగ్రత్తగా చెట్టుని తోయి అనని చెప్తున్న రవి మాటలు పుర్తికానేలేదు, ఇంతలో ఆకస్మికంగా రాగిణి జారి పడసాగింది ఆమెను పడకుండా చేత్తో ఆపుతూ జాగ్రత్త అని హెచ్చరించి హితబోద చేసాడు. హెచ్చరించి నిమిషం కూడా కాలేదు తనకే బాలన్స్ తప్పి కింద పడ్డాడు రవి. రాగిణి పక పక నవ్వి పక్కన వాళ్ళకి చెప్పడం కాదు ముందు మనం జాగ్రత్తగా వుండాలి అని అంది చిరుమందహాసంతో.

                      మీ అమ్మాయిలు వున్నారే మా అబ్బాయిల మాటలను ఎప్పుడూ అర్ధం చేసుకోరు - కాస్త పాజిటివ్ గా ఆలోచించండే! - నువ్వు కింద పడకుండా ఆపింది నేను...! కానీ నేను పడిపోతే నవ్వుతావా? చేయి ఇవ్వు అని చిరుకోపంతో అడిగాడు.
                    సరేలే ఎప్పటికైనా నా సహాయం లేనిదే మీరు పైకి కూడా లేవలేరు అంది రాగిణి, అబ్బో చాల్లే ఇప్పటికే వినలేక పాప గుక్కపెట్టి ఏడుస్తోంది ఇంక ఆపకపోతే నేను కూడా ఏడవటం మొదలు పెట్టాల్సి వస్తుంది.                          
                   అవునండోయ్...! చూసావా? ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావ్, అది చాలు నాకు ఈ జన్మకి.

                 ఉహూ...! మీ బొంద నిజంగానే పాప ఏడుపు వినిపిస్తోందండి, ఇంత రాత్రి వేళలో, చీకటిలో, అదీ వర్షంలో, ఎక్కడి నుంచి అండి ఈ పాప ఏడుపు? నన్ను అడిగితే నాకేం తెలుసు దగ్గరలో ఇళ్ళు కూడా ఏమీ లేవే ఎవరి పాప అయివుంటుంది. ముందు చూద్దాం పదండి. సరే పద వెతుకుదాం ముందు పాపని.

                  ఒక పెద్ద రావి మరియు వేపాకు కలిసి పెరిగిన చెట్టు మొదలులో ఆ పాప ఏడుపు వినిపించింది. దగ్గరకి వెళ్లి చూసారు రవి మరియు రాగిణిలు. చెట్టు అడవికి దగ్గరలో వుండటం మరియు వర్షం కారణo గానేమో ఒక పాము ఆ పాపకి దగ్గరలో వుంది బయంతో ఎక్కడ ఆ పాము పసిబిడ్డను కాటేస్తుందో అనని బయపడి ఇద్దరూ జోరుగా పరిగెత్తి కాపాడసాగారు, కానీ పాము పాప రక్షణ కోసమే వున్నట్టు పడగ విప్పి ఆశీర్వదించి మరీ వెళ్ళిపోయింది.

                  ఎంతైనా తల్లి మనసు కదా! ఎంత పెద్ద ప్రమాదం తప్పిందే నా చిట్టి తల్లి అని అంటూ హటాత్తుగా ఆ పాప ని గుండకి హత్తుకుంది రాగిణి. రవి ముబావిగా మొహం పెట్టుకుని ఎప్పుడైనా నన్ను అలా ఒక్కసారైనా గుండెకి హత్తుకున్నావా? అనని అంటూ ఓరకంటి చూపుతో తనవైపు చూసాడు. దేవుడా అని ఊపిరి గట్టిగా పీల్చుకుని తిట్టబోతుంటే....వాళ్ళ గోలలో వాళ్ళు వుండి తనని పట్టించుకోవటం లేదు అనని  కాబోలు మద్యలో  నేనొకదాన్ని వున్నాను అని గుర్తుచేస్తూ పాప ఏడుపు ఆపి నవ్వుతూ వాళ్ళిద్దరినీ పలకరించింది. అప్పుడే పాప ని చూసారు వాళ్ళిద్దరూ ఆ అందమైన తేజస్సుతో కూడిన పాప మొహం చీకటిలో కూడా ఏ మాత్రం వెలుగు తగ్గకుండా మెరిసిపోతువుంది. నిజంగా లక్ష్మీ సరస్వతీ దేవతల అంశతో పుట్టిన శక్తి అవతారం లా కనిపించింది వాళ్ళిద్దరికీ ఆ పాప.

                 రాగిణి ఎంతో సంతోషంగ పాపను ఎత్తుకుని ఆడిస్తూ చిన్నూ, బంగారం వస్తావా మా ఇంటికి తీసుకెళ్తాను అని అంటూ ముద్దు చేసింది. హా అవునవును ముందు నువ్వు రామ్మా మా ఇంటికి వెనకాలే మీ అమ్మ వస్తుంది పోలీసులతో. హ్మ్... అంత వెటకారం అక్కర్లేదు. లేకపోతే ఈమె తీసుకెల్తుందంట పాప రావలంట - బానే వుంది సంబరం, మీ రాకపోకలతో నేను జైలు చుట్టూ తిరగాల్సి వస్తుందేమో.! అలా ఏం కాదు పాప వల్ల ఎవరికైనా మంచే గాని చెడు జరగదు. ఏ చిలక జ్యోతిష్యుడు చెప్పాడమ్మా ఈ మాటలు.

                పాప మొహం చూస్తుంటే మీకు వదిలేసి వెళ్ళాలని అనిపిస్తోందా? చెప్పండి. ప్లీజ్ అండి మనతో తీసుకుని వెళ్దాం. నాకు కూడా మనతో పాటే తీసుకెళ్ళాలని వుందే కానీ వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే ఏం చెప్తావ్
                నా పాపని ఎందుకు తీసుకొచ్చారు
                సారీ
                ఎందుకు దొంగతనంగా తెచ్చారు అని పోలీసులతో వస్తేనో?

అప్పుడు ఏమని చెప్తావ్? చూడు ఆ పాప ఎవరో మనకి తెలీదు కేవలం ఈ కొంచం సమయానికే అంత తల్లి ప్రేమని వలకపోయకు అన్నాడు రవి కాస్త గంభీరంగా.

సరేలే అలా అయితే అంది రాగిణి ఏడుపు మొహం పెట్టి. పద వెళ్దాం ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.  ఏంటి ఎక్కడికి వెళ్ళేది పాపని వాళ్ళ అమ్మకి జాగ్రత్తగా అప్పగించేదాకా ఈ పాపని వదిలి నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అంది. ఉహూ.... ఈ చీకటిలో ఎక్కడని వెతుకుతావే ఆమె కోసం నాకు అదంతా తెలీదు/

దేవుడా...! సరే నీ ఇష్టం వచ్చినట్టే కానీ. . అని చెప్పి అలాగే బైక్ మీద కూర్చుని తనకి తెలియకుండానే నిద్రపోయాడు రవి. రాగిణి మాత్రం ఆ పాపతో అలాగే తెల్లవారే వరకూ ఆడుతూ సమయాన్ని గడిపేసింది. చెట్టు మీద నుంచి ఆకు మొహం మీద పడి ఏదో దెయ్యం మీద పడినట్టు అరుస్తూ నిద్ర లేచాడు రవి. కనీసం తన అరుపులను కూడా వినిపించుకోకుండా పాపతో అడుకుంటోంది రాగిణి. ఇలాగే వదిలేస్తే ఎక్కడ తను పిచ్చిది అయిపోతుందో అనని పలకరించి పద ఇంక ఇంటికి వెళ్దాం ఎన్నాళ్లని ఇక్కడే వుంటావ్ అన్నాడు రవి. పదండి వెళ్దాం అని పాపను ఎత్తుకుని హుషారుగా బండి ఎక్కింది.

తర్వాత పాప గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చారు కానీ తనకు సంబందించిన వాళ్ళెవరు రాలేదు. ఆ పాప వచ్చిన వేళా విశేషమో ఏమో రవికి బిజినెస్ లో చాలా కలిసి వచ్చింది, రాగిణి గర్బవతి అవటం ఇంకా సొంతంగా పెద్ద luxury ఇల్లు కట్టుకోవటం తో పాటు అడిగిన వారికి లేదనకుండా ఆ పాప పేరు మీద అన్నదానం చేసే స్టేజి కి ఎదిగాడు రవి. కానీ పిచ్చిదానిలాగా కనీసం నాకు కూడా చెప్పకుండా ఆ పాపకోసం హాస్పిటల్ కు వెళ్లి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని రావటం నిజంగా నా బార్య మూర్ఖత్వమే. కానీ తన బార్య పాప మీద చూపించే పిచ్చి ప్రేమను చూసి  ఎక్కడ పాపకు సంబందించిన వాళ్ళు వచ్చి పాపని తీసుకెల్తారో - అలా జరిగితే రాగిణి ఎమైపోతుందా అనని బయంతో రవికి దిగులు పట్టుకుంది\.

మళ్లీ కొన్నాళ్ళకు ముగ్గురూ సినిమా చూసుకుంటూ అదే దారిలో వస్తుండగా పెద్ద వర్షం, పాప దొరికినప్పుడు పడ్డ వర్షంలాగా పెద్ద పెద్ద ఉరుములతో వర్షం మొదలైంది అది చూసి రాగిణి బయంతో తన బర్త చొక్కాను పట్టుకుని గుంజుతూ నాకు చాలా బయంగా వుందండి పాపని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకుని వెళ్లారు కదా అనంది ఏడుస్తూ.. తను ఏడుస్తుంటే చూడలేక ఇలా జోక్ గా - ముందు నా చొక్కాని ఉతకడం ఆపు అన్నాడు రవి. అబ్బా నాకు చాలా బయంగా వుంది తొందరగా పదండి అంది రాగిణి. ఇక్కడే వుండు మళ్లీ ఇంకో పాప దొరుకుందేమో చూద్దామా? కారు కిందకి దిగి అన్నాడు చమత్కారంగా. మీ జోకులు ఆపి కార్ పోనివ్వండి అంది. కారు స్టార్ట్ చేసేలోపే  ఎవరో ఒక అమ్మాయి వచ్చి పాపని రాగిణి చేతుల్లోనుంచి లాక్కుని పాపకి ముద్దులు పెడుతూ ఎన్నాళ్ళు అయిందమ్మ నిన్ను చూడక ఎలావున్నవే నా చిట్టి తల్లి అని ఏడవసాగింది, అది చూసి కోపంగా నా బిడ్డని లాక్కుని ఏడవటానికి ఎవరు నువ్వు హా ?

ఇవ్వు ఇలా నా పాపను అంది పెద్దగా అరుస్తూ రాగిణి.... అవునమ్మా ఈ పాప మీ పాపే, అనాధ అస్సలే కాదు, తిసుకోమ్మా నీ బిడ్డని, తప్పైపోయింది క్షమించండమ్మా అనని చెప్పి రవి పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆగకుండా వెళ్ళిపోయింది.

తర్వాత రోజు ఆ పాప తల్లి రైలు పట్టాల కింద పడి చనిపోయినట్లు పోలిసుల ద్వారా అందిన వార్తతో ఆ పాపను అందరి సమక్షంలో రవి రాగిణులు దత్తతు తీసుకుని తమ సొంత పాపకంటే కూడా ఎంతో  ప్రేమగా పెంచుకోసాగారు.

ఆ రోజు కనిపించి రాగిణి చెత్తుల్లొనుంచి పాపను తీసుకుని ఏడ్చిన ఆమె పాపతల్లా? నిజంగా ఆ పాప ఎవరో, తన తల్లి ఎవరో తెలియకపోయినా, పాపను వాళ్ళిద్దరూ కన్నబిడ్డలాగా పెంచుకోవటం చుస్తే పాపతల్లి ఏలోకంలో వున్నా, ఎక్కడ వున్నా సంతోషిస్తుంది.


so my dear friends, మీకు కూడా ఎవరైనా పసి పిల్లలు రోడ్డు పక్కనో, తల్లి దండ్రులు పెంచలేక వదిలేస్తేనో లేదా మరేదైనా కారణంగా ఏ పసికందైనా కనబడితే మనకెందుకులే శ్రమ అని అనుకోకుండా చేతనైనంత సహాయం అందించమని అర్దిస్తున్నాను 
లేదా 
కుదిరితే వాళ్ళని పిల్లల అనాధాశ్రమంలో చేర్చి ఒక భారత పౌరుడిగా మీ వంతు సహాయం చేర్చల్సిందిగా కోరుకుంటున్నాను.

ఇదీ ఫ్రెండ్స్ ఈ వారం కధ, మళ్లీ ఇంకో కొత్త కధతో మళ్ళి కలుద్దాం. మీ విలువైన కామెంట్స్ ని పోస్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దే... 


Signing of by Teju Innovations                                                Read Our Next Story


********************************************************************************
                   









Why I Love My Office A Lot ?