Love @ 60
-------------------------------------------------------------------------------------------------------------------------
అదొక అందమైన వేకువజాము, పచ్చ పచ్చని చెట్లతో మంచు చినుకుల మద్యలో
ఇమిడిపోయిన ఆకులు, అందమైన పూలతో నిండిన ఉద్యానవనం అది. వచ్చీ రాని సూర్య
కిరణాలు ఆకుల మీద పడి మెరుస్తూ వుండగా మరో పక్క మంచు చినుకులు ఆకుల మీద
నుంచి నేలమీదకి జారుతుండగా, ఆ చినుకులను కింద పడనివ్వకుండా చేతితో
పట్టుకుంటూ ఆడుకుంటున్న ఒక అందమైన బామ్మ.
వయసుకి బామ్మ అని పిలవాలేమో గాని ఆమెని చూస్తే మాత్రం ఎవరూ బామ్మా అని పిలవడానికే మనసు రాదు అంత అందంగా వుంటుంది ఆమె చూడటానికి. ఆ చెట్లే తన పిల్లలు అన్నట్లు ఎంతో ప్రేమగా వాటికి నీళ్ళు పోసి పెంచుతూ, ఆ ఉద్యానవనం ని అందంగా తీర్చిదిద్దుతున్న ఆమెను చూస్తుంటే మాతృత్వ భావం వెల్లివిరుస్తుంది ఎవరికినా. చెట్లకి వున్న పూలు కోస్తే ఎక్కడ ఆ చెట్టుకి నొప్పి కలుగుతుందో అనని సుతిమెత్తంగా ఎండిపోయిన పూలను తుంచే విదానం - ఎదుటి వారికి కష్టాన్ని కలిగించని ఆమె మంచి మనసుకి నిదర్సనం. ఎన్నో జన్మల నుంచి పరిచయం వున్నట్టు చెట్లతో ఆమె చేసే సంభాషణ, స్నేహం ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతే కాకుండా రోజూ మార్నింగ్ వాక్ అంటూ వచ్చే అందరికీ ఆమె స్వయంగా మంచినీరు అందచేస్తుంది దానికి ప్రతిఫలంగా తర్వతరోజు వాళ్ళు వచ్చేటప్పుడు ఒక కొత్త మొక్కని తీసుకు వచ్చి ఉద్యానవనంలో పెంచాలి అనని కండిషన్ కూడా.
ఎదురుగా రెండు అంతస్తుల డాబా, ఆ డాబా బాల్కనీలో కాలు మీద కాలు వేసుకుని పేపర్ చేతిలో పట్టుకుని దర్జాగా చేతిలో కాఫీ కప్పుతో ఆ బామ్మనే రోజూ గమనిస్తున్న ఒక తాత. ప్రతిరోజూ తెల్లవారకుండానే మార్నింగ్ వాక్ అంటూ ఆ ఉద్యానవనం కి వచ్చి ఆమె కోసం ఎదురుచూస్తూ, ఆమె చేసే పనులలో సహాయం చేస్తూ, ఆ వుద్యనవనంలోనే తన కాలాన్ని గడుపుతున్న ఆ తాత కి ఒకరోజు అనుకోకుండా ఆమె జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనిపించింది. అసలు ఎందుకు ఆమె అనాధ లాగా ఇక్కడ ఎందుకు వుంటుంది, ఆమెకి ఎవరూ లేరా లేదా వుండి వదిలేశారా తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. ఎంతసేపు ఇలాగే పనిచేస్తావు గాని ఇలా విశ్రాంతిగా కూర్చుని కాసేపు చల్లని గాలి తీసుకో అనని చెప్తున్న తాత మాటలను ఒక చెవితో వింటూ తన పని తాను హుషారుగా చేసుకుంటూ పోతోంది. నాతో ఏమైనా మాట్లాడాలా ఏంటి? అని బామ్మ అడిగీ అడిగినవెంటనే హా అవును అన్న మాటలు విని ఏం మాట్లాడలేం ఈరోజు అంట హుషారుగా వున్నారు అని అడిగింది బామ్మ, అవును నీ గురించి తెలుసుకోవాలని వుంది అదీ నీకు ఇష్టం అయితేనే సుమీ...!
తాత అడిగీ అడిగినవెంటనే టక్కున చెప్పటం మొదలు పెట్టింది కన్నీరుతో. తన మోహంలో ఎప్పుడూ, తేజస్సుతో కూడిన నవ్వు తప్పితే కన్నీరు చూడని తాత బయంతో ఏమైంది ? నేనేమైన తప్పుగా అడిగానా ? అని తాత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇప్పటి వరకూ తన బాధ ని ఎవరితో చెప్పుకుని ఏడవాలో తెలియక ఈ చెట్టు పుట్టలతోనే కాలం గడిపేసాను ఇప్పుడు హటాత్తుగా మీరు అడిగేసరికి కళ్ళ లో నీళ్ళు తిరిగాయి అని తన విషాదమైన కధను చెప్పడం మొదలు పెట్టింది.
అవును నేను ఒక అనాధని, మా అమ్మ నా చిన్నప్పుడే ఈ పక్కనే వున్న అనాధ శరణాలయం లో వదిలేసి వెళ్లిందట. నాకు వూహ తెలిసినప్పటినుంచీ ఈ శరణాలమే నాకు అమ్మా, నాన్న, బడి అన్నీ. బాగా కష్టపడి గవర్నమెంట్ జాబు తెచ్చుకున్నా ....
మరి పెళ్లి, పిల్లలునో ..ఽని అడిగాడు తాత కుతూహలంగా
హ్మ్ అదే చెప్తున్నా...మాది లవ్ మ్యారేజ్, ఎంతో గొప్పగా అందంగా జరిగింది మా పెళ్ళి. నా చిన్నప్పుడు ఎవరైతే నన్ను నష్టజాతకురాలు అన్నారో వాళ్ళే ఈ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నారు. మరికొందరైతే వాళ్ళ కూతురు కంటే మంచి గొప్పింటి అమెరికా సంబంధం వచ్చిందని శాపనార్ధాలు పెట్టారు వాటి ఫలితంగానేమో పెళ్ళి అయ్యి అమెరికా వెళ్ళిన కొద్దిరోజులకే మావారు చనిపోయారు.
మరి పిల్లలూ ..... అని అడిగాడు తాత ఆత్రుతగా,
హూం.... పెళ్ళి అయిన మొదటి సంవస్తరానికే బాబు పుట్టాడు కానీ నా దురదృష్టమో వాడి అదృష్టమో వారితోనే బాబు కూడా అదే ఆక్సిడెంట్ లో చనిపోయాడు, ఆ దేవుడు నన్ను మాత్రం ఎందుకు వుంచాడో అర్దం కాలేదు చావటానికి ప్రయత్నించాను కానీ ఆ అదృష్టానికి కూడా నేను నోచుకోలేదు.
మా ఆయన బ్రతికున్న రోజుల్లో చాల సార్లు నాతో తనకి ఒక కోరిక వుందని చెప్తుండేవారు - ఇక్కడ బాగా సంపాదించి మన దేశానికి వెళ్ళి ఒక మంచి పెద్ద హాస్పిటల్ కట్టి ఉచితంగా పేదవారికందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అందుకే చాలా కష్టపడి ఆయన పేరు మీద హాస్పిటల్ కట్టించి ఉచితంగా వైద్యం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశాను. ఆయన ఆశను నా రూపం లో జరిపిన్చుకోడానికేనేమో ఆ దేవుడు నన్ను ఇంకా ఉంచింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ తనలో దాగివున్న బాధను వ్యక్తం చేస్తోంది.
" ఒంటరిగా తనలో తనే మాట్లాడుకునేవారి వెనకే ఎన్నో బాధలు దాగి వుంటాయి అనని - తన బాధని పంచుకొనేవారు లేకే చెట్లతో పుట్టలతో మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తోందనిమాట ఇన్నాళ్ళు."
ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా అన్నీ పనులూ చక చక చేసే ఈమే మనసులో ఇంత విషాదం దాగివుందా? అందుకే అంటారు పెద్దలు
అని మనసులో అనుకుని పైకి బామ్మతో ఇలా చెప్పసాగాడు
తప్పుదారి పట్టించేది ఆవేశం
నువ్వు ఆవేశంలో చనిపోవాలి అని ప్రయత్నించినా తర్వాత ఆలోచించి నలుగురికి సహాయపడేలా మంచి పనే చేసావు.
బామ్మ : అవును ఆ ఆవేశంలో, అనాలోచనగా నేను ఏం చేస్తున్నానో నాకే అర్ధం కాని పరిస్తితి, చావాలని చేసిన ప్రయత్నాలను తలుచుకుంటే ఒక్కొక్కసారి నేను ఎంత అనాలోచనగా ప్రవర్తించానో తెలుస్తుంది.
హ్మ్.... నా కథ చెప్పి మిమ్మల్ని కూడా విసిగించినట్టు వున్నాను. రండి అలా వెళ్ళి ఆ రోజా పూలను నాటుదాము. సరే పద కాసేపు మనుసు వేరే వైపుకు మల్లించినట్టు వుంటుంది. సరేగాని ఇంతకీ మీరేమిటి ఈరోజు ఇంకా ఇక్కడే వున్నారు ఇంటికి వెళ్ళి అందరితో కలిసి టిఫిన్ చేయటానికి వెళ్ళరా?
ఏంటి ...! ఏమన్నావ్ ? అందరితో కలిసా? నాకు అంత అదృష్టం ఎక్కడ వుంది. అదేంటి నేను విన్నంత వరకు మీకు 6 పిల్లలు అని విన్నానే.
తాత : అవును పేరుకే పిల్లలు,
బామ్మ: అదేంటి అలా అంటారు? మీకు పిల్లలంటే ఇష్టం లేదా?
తాత : నాకా ఇష్టం లేనిది? నాకు పిల్లలంటే చాలా ఇష్టమని తన ప్రాణాలని కూడా లెక్కచేయకుండా ఈ రోజుల్లో కూడా మా ఆవిడ 9 మందికి జన్మనిచ్చింది. పిల్లలికి జన్మనైతే ఇవ్వగలం గానీ
మంచి బుద్దులు మాత్రం ఇవ్వలేకపోయాం.
బామ్మ: ఏమైంది ?
తాత : ఏముంది.. విదేశాల పిచ్చి, కన్న తండ్రి ఎలా ఉన్నాడో కూడా పట్టించుకోకుండా పెళ్ళాం, పిల్లలతో సహా విదేశాలలోనే సెటిల్ అయ్యాడు. మనదగ్గర లేని డబ్బా? ఎందుకురా అంటే? లేదు నాన్నా అక్కడ వుంటే గొప్పతనం, నువ్వు అందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి, నన్ను అనాధ శరనాలంలో చేర్చి చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బోలెడన్ని డబ్బులు కూడా కట్టి మరీ విదేశాలకి వెళ్ళాడు. ఒక్క ఫోనూ వుండదు ఏమన్నా అంటే వర్క్ బిజీ.... మేం బిజీ కాదా ఆరోజుల్లో అలా అని వదిలేశామా వాళ్ళందరిని పెంచకుండా? పెద్దవాళ్ళని చేయకుండా?
" అదే అంటారు...! పిల్లల్నైతే కనగలం గాని వాళ్ళ బుద్దులను, రాతలను కనలేం అనని "
రేపు నేను చనిపోయినా కూడా నా తలకొరివి పెట్టడానికి కూడా నా కొడుకుల్లో ఒక్కరూ రారు...!
బామ్మ: సరే సరే కూల్...!
ఆపండి ..! అలా బాధపడకండి? ఎదవద్దు.... అబ్బాయిలు ఏడిస్తే బాగోదంట ?
సారీ "ముసలి తాత" ఏడుస్తుంటే చూడటానికి బాగోదు.
తాత: ఏంటి ? నేను ముసలి తాతనా ? I am still young you know? (నేను ఇంకా కుర్రోడినే తెల్సా నీకు?)
అని చెప్పాడు ముక్త కంటంతో అరుస్తూ....
బామ్మ: అబ్బో ..! అయ్యగారికి కోపం కూడా వస్తుందే ??????????????????
అవునవును... ! Ya.... I know, You are still in sixteen years only నో అన్నది నవ్వుతూ .....
సరే ఇంక చాలా సమయమైంది, మీరు వెళ్ళి ఏదైనా తిని రండి లేకపోతే ఇక్కడే కళ్ళుతిరిగి
పడిపోతారేమో అననిపిస్తోంది మీ మొహం చూస్తుంటే, అబ్బో అంత బొంగ మూతి వద్దులే నేను
సరదాగా అన్నాను.
తాత: సరే పద మా ఇంటికి, నేనే నా చేతులతో టిఫిన్ చేసి పెడతాను నీకు. సందేహించకు మా ఆవిడ కాలం
చెల్లించినప్పటి నుంచీ నేనే వంట చేసేవాడిని కనుక ఏం పర్వాలేదు. నువ్వు దైర్యంగానే టేస్ట్ చేయొచ్చు.
అలా ఆ రోజు ఎంతో సంతోషంగా రోజు ముగిసింది. ఆ తర్వాత ఏదో హాస్పిటల్ యొక్క - ముఖ్యమైన పని మీద బామ్మ వేరే ఊరికి వెళ్ళాల్సివచ్చింది. పేరుకే వాళ్ళిద్దరూ వేరు వేరు ప్రదేశాలలో ఉన్నారే గాని ఒకరి గురించి ఒకరు అలోచించుకుoటూనే వున్నారు..
ఆ తర్వాత కూడా వాళ్ళు ఎదురుపడినా మాట్లాడుకోలేదు కొన్ని రోజుల వరకు, సమాజం గురించి పట్టించుకోకుండా హటాత్తుగా ఒక రోజు మనం పెళ్ళిచేసుకుందాం అనని ఇద్దరూ నిర్ణయం తీసుకుని పెళ్ళిచేసుకుని ఆనందంగా వాళ్ళ చివరి రోజులు గడిపారు.
తర్వాత హాయిగా తాత ఆస్తి, బామ్మ తెలివితేటలతో హాస్పిటల్ తో పాటు ఒక మంచి వృద్ధాశ్రమం కూడా పెట్టి వాళ్ళు హాయిగా కాలాన్ని గడపటమే కాకుండా నలుగురికి కూడా ఆనందాన్ని పంచారు.
" మనం మంచి వారమై, మంచి దృక్పదంతో మన చుట్టూ ఉన్నవారికి మంచి చేయాలనుకోవాలేగాని దేవుడు అడుగడుగునా మనకి సహకరిస్తూనే వుంటాడు అంతేకాకుండా మనల్ని చివరి వరకూ కాపాడుతూనే వుంటాడు అనని. "
so my dear friends మీరు కూడా మీకు తోచినంతలో అందరికీ సహాయం చేయటానికి ప్రయత్నించండి మీ ప్రయత్నం వల్ల ఎంత మందికి మంచి జరుగుతుందిలే (నేనేమ్ చేయగలనులే) అని ఆలోచించకండి - మీ ఒక్క చేయి వంద మంది చేతులను కలుపుతుంది అందరికీ సహాయం అందుతుంది.

మంచిదారికి మల్లించేది ఆలోచన
ఆవేశంలో అనాలోచితంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదు నువ్వు ఆవేశంలో చనిపోవాలి అని ప్రయత్నించినా తర్వాత ఆలోచించి నలుగురికి సహాయపడేలా మంచి పనే చేసావు.

Moral ( నీతి ):
"(True Love) స్వచ్ఛమైన ప్రేమకి వయస్సు, అందం, డబ్బు ఎప్పటికీ అడ్డు కాదు."
ఎవరూ లేని బామ్మకి , అందరూ వుండి కూడా అనాధలాగా కాలాన్ని వెళ్లబుచ్చుతున్న తాతకీ మంచి తోడూ, జోడూ కుదిర్చాడు ఆ దేవుడు.
ఆ చివరి రోజులలో వాళ్ళకి ఇంకేం కావాలి? తమ కష్టసుఖాలని పంచుకునే ఒక తోడు అది వారిద్దరికీ దొరికినట్టే ఇంకేం కధ సుఖాతం మనం ఇంకో కథ చదువుదాం....
signing off by Teju Innovations....